చౌదరిగూడలో కల్తీ మిక్సర్ తయారీ కేంద్రంపై ఎస్ఓటీ దాడి…గడువు ముగిసిన ముడి పదార్థాలు, సింథటిక్ రంగులు స్వాధీనం

ఘట్‌కేసర్, ఆగస్టు 12 (ప్రజా వాణి): పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌదరిగూడ గ్రామంలో నిర్వహిస్తున్న మిక్సర్ తయారీ యూనిట్‌పై ఎస్ఓటీ ఉప్పల్ జోన్ బృందం బుధవారం దాడి నిర్వహించింది. విశ్వసనీయ సమాచారం మేరకు యూనిట్‌లో తనిఖీలు చేపట్టిన అధికారులు, గడువు ముగిసిన ముడి పదార్థాలు, సింథటిక్ ఆహార రంగులను ఉపయోగిస్తూ అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సరైన అనుమతులు, లైసెన్స్ లేకుండా యూనిట్ నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి చౌదరిగూడ గ్రామానికి చెందిన కాలా...