నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చందూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన వార్డు సభ ఆర్డీవో శ్రీదేవి ముఖ్య అతిథిగా ఉన్నారు. ఈ వార్డు సభలో ముసాయిదా ఓటరు జాబితా (ముసాయిదా ఎలక్టోరల్ రోల్స్) మరియు SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కి సంబంధించిన వివరంగా ఆర్డీవో శ్రీదేవి మాట్లాడుతూ. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, తొలగింపులపై బిఎల్ఓ లు, బిఎల్ఎ లకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంటికి తిరిగి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు. SIR ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయడానికి. పట్టణంలోని అన్ని వార్డులలో ఓటరు జాబితా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ప్రజల తమ ఓటు వివరాలను సరిచూసుకోవాలని అధికారులు నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎల్ మల్లేశం, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు థశరధ, స్థానిక కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, బిఎల్‌ఓలు, బిఎల్‌ఎలు.