చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట లో ఆర్ అండ్ బి రోడ్డు పనులు మందకొడిగా – ప్రజల ఇక్కట్లు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో జరుగుతున్న అండ్ బి రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తరబడి పనులు పూర్తి కాన నెల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. *ప్రజల ఆవేదన* "రోడ్డు పని ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు అయిపోతుందో తెలియదు. కాంట్రాక్టర్ ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నందున రోజూ దుమ్ము ధూళి, కంకర రాళ్ళతో ఇబ్బందులు పడుతున్నాం" అని మహిళలు...