చండూరు వ్యవసాయ మార్కెట్ గోదాములో భారీ చోరీ?
రాత్రికి రాత్రే మాయమైన వారి ధాన్యం నిల్వలు! స్థానికుల పనా? పరాయి ముఠా దాపురించిందా? మున్సిపాలిటీ వ్యాప్తంగా గుసగుసలు.. విచారణకు ప్రజల డిమాండ్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి స్థానిక వ్యవసాయ మార్కెట్‌ని వారి ధాన్యం నిల్వల గోదాములో భారీ దొంగతనం జరిగిందంటూ చండూరు మున్సిపాలిటీ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గోదాములోని పెద్ద ఎత్తున ధాన్యం బస్తాలు రాత్రికి రాత్రే మాయమయ్యన్న ప్రచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా మార్కెట్ యార్డులోని నిల్వలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోదాము...