prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 4:18 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

చండూరు వ్యవసాయ మార్కెట్ గోదాములో భారీ చోరీ?

రాత్రికి రాత్రే మాయమైన వారి ధాన్యం నిల్వలు!

స్థానికుల పనా? పరాయి ముఠా దాపురించిందా?

మున్సిపాలిటీ వ్యాప్తంగా గుసగుసలు.. విచారణకు ప్రజల డిమాండ్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

స్థానిక వ్యవసాయ మార్కెట్‌ని వారి ధాన్యం నిల్వల గోదాములో భారీ దొంగతనం జరిగిందంటూ చండూరు మున్సిపాలిటీ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గోదాములోని పెద్ద ఎత్తున ధాన్యం బస్తాలు రాత్రికి రాత్రే మాయమయ్యన్న ప్రచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా మార్కెట్ యార్డులోని నిల్వలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోదాము నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం కొల్లగొట్టారని, ఇందులో లక్షలాది రూపాయల విలువైన సరుకులు మారిందనే వార్తలు పట్టణంలో దావానలంలా వ్యాపించాయి. ఈ ఘటన వెనుక అసలు సూత్రాలు ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంత భారీ పరిమాణంలో ధాన్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా వాహనాల్లో తరలించాలంటే స్థానికుల సహకారం లేకుండా సాధ్యం కాదనే అనుమానాలు కూడా స్థానిక ప్రజల్లో బలపడుతున్నాయి. గోదాములో ధాన్యం మాయమైన వ్యవహారంపై అధికారులు గానీ, పాలకవర్గం గానీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడంపై మున్సిపల్ ప్రజలు, రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సిద్ధం వెంటనే స్పందించి, గోదాములోని స్టాక్ రికార్డులను పరిశీలించి, సమగ్ర విచారణ జరిపి అసలు నిజాన్ని ప్రజల ముందుంచాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.