చండూరు లో పీహెచ్ సీను తక్షణమే అభివృద్ధి చేసి 100 పడకల హాస్పిటల్ ను ఏర్పాటు చేయాలి – బీఎస్పీ అయితరాజు అభయేందర్
నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి): నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పీహెచ్‌సీని బీఎస్పీ నాయకులు పరిశీలించారు. మండల అధ్యక్షులు కడారి సైదులు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశీలనలో ఆసుపత్రి పరిస్థితులను పరిశీలించిన బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయితరాజు అభయేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 40 వేల జనాభాకు వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రిలో కేవలం ఆరు పడకలు మాత్రమే ఉండటం దారుణమని అన్నారు. ఉన్న పడకలు కూడా సౌకర్యవంతంగా లేవని, ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరిందని ఆరోపించారు....