prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 12:32 am Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

చండూరు మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతల ఫైర్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:

నల్గొండ జిల్లా చందూర్ మున్సిపాలిటీలో బ్లాంకెట్ హల్ ప్రెస్ మీట్ నిర్వహించి మండల పార్టీ టౌన్ మాజీ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్ మాట్లాడుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు 17వ తారీఖున మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి, షాద్ ముబాక్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరసనగా ధర్నా చేసింది. ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ లంచాలు ఇచ్చిన వాళ్లకు తీసుకున్నోళ్లకు ఆ దేవుడికే ఎరుక అని అన్నారు. దానికి మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించి వైన్ షాప్ యాజమాన్యం, పండ్ల బండి వ్యాపారస్తుల దగ్గర 12 లక్షల రూపాయలు తీసుకున్నామని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాపై ఆరోపణలు చేశారు. అది నిజమని నిరూపిస్తే నా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అలాగే శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రమాణం చేయడానికి ఆహ్వానిస్తున్నామని అన్నారు. మేము ప్రెస్ మీట్ నిర్వహించి చేస్తే మీరు చేయండి మాకే అవసరం అందుకే మిగిలిన రెండు సంవత్సరాలు మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోమని ఆంజనేయ స్వామి దగ్గర ప్రమాణం చేయండి మాకేమీ అవసరం అని కొత్తపాటి సతీష్ అన్నారు. మీ పార్టీకి సంబంధించిన కుంభం శ్రీనివాస్ రెడ్డి వారి ధాన్యం విషయంలో స్కామ్‌లు చేసిన విషయం అందరికీ తెలిసిందే, ఆ విషయంలో కుంభం శ్రీనివాస్ రెడ్డిని నేను చేయలేదని ప్రమాణం చేయమనండి అని కొత్తపాటి సతీష్ అన్నారు. అలాగే చందూర్ లో బస్టాప్ నిర్మాణంలో కూడా అధికార పార్టీ వారు వ్యతిరేకిస్తున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో మా బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని అన్నారు. అంతేగాని మేము చేసిన పనులను ఆపివేయడం మంచిది కాదని అన్నారు. ఇరిగి రామన్న మాట్లాడుతూ అధికార పార్టీ మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్న పీఏ కాకుండా మండలానికి ఒక షాడో ఎమ్మెల్యే ని పెట్టి మండలాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్ వెళ్ళి పోతుండు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే మండలంలో ఉన్న షాడో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే వారు పట్టించుకోరు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ ఉండడు. ప్రజల సమస్యలు తీర్చేది ఎవరు అని అన్నారు. అదే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజా సమస్యలను తీర్చుకుంటూ వెళ్తాడు అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీకి వెళ్తే లోపలికి రానివ్వకుండా తలుపులు వేస్తున్నారని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. మన రాష్ట్రం పరువు ఢిల్లీకి వెళ్లి తీస్తున్నారని అన్నారు. అదే మన కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి తెలంగాణ సమస్యలపై పోరాటం చేశారు. వెంకన్న మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 40 కోట్ల నిధులతో మండలానికి రోడ్ల నిర్మాణం ఏర్పాటుకు అదేవిధంగా గ్రామానికి లింకు రోడ్లను నిర్మించి మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ఉంచారు. మీ ప్రభుత్వం 70 సంవత్సరాల నుండి మునుగోడు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదు? మా ప్రభుత్వం అందించిన నిధులతో అభివృద్ధి చేస్తుంది తప్ప చేసింది ఏమీ లేదు? బై ఎలక్షన్ లో గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కెసిఆర్ నిధులు రానీయకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. నిధులు ఏమైనా తెచ్చారా? అని అన్నారు. మా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దమ్మున్న లీడర్ అని అన్నారు. దశరథ మాట్లాడుతూ మా ప్రభుత్వం అందించిన కళ్యాణ లక్ష్మి,షాద్ ముబారక్ పథకాలను పక్కన పెట్టి దేవుళ్ళ పై ప్రమాణాలు చేస్తున్నారే తప్ప పనులు చేయడం లేదని చెప్పారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు కొత్తపాటి సతీష్ రామన్న, దశరథ, గీత, చంద్రశేఖర్, వెంకన్న, జానయ్య, వార్డు కౌన్సిలర్లు నిర్వహించారు.