ఘనంగా వేముల మహేష్ గౌడ్ నివాసంలో బోనాల పండుగ
ఘట్‌కేసర్, ఆగస్టు 23(ప్రజావాణి): మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ నివాసంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, మాజీ...