ఘట్‌కేసర్, ఆగస్టు 23(ప్రజావాణి): మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ నివాసంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ వేముల మమత గౌడ్, మాజీ ఉపసర్పంచులు వేముల సత్తయ్య గౌడ్, వేముల పరమేష్ గౌడ్, కొమురవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు గుర్జకుంట నర్సింహా, వేముల శంకర్ గౌడ్, నానావత్ సురేష్ నాయక్, డొంకెన శంకర్ గౌడ్, నాయకులు వేముల గోవర్ధన్ గౌడ్, బర్ల రమేష్, వేముల వినోద్ గౌడ్, వేముల వెంకటేష్ గౌడ్, కట్కూరి భాను గౌడ్, యువ నాయకుడు వేముల మనిశరణ్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఇంటి వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
