ఘనంగా ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

  అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు ప్రతీకగా రాఖీ పండుగ   పోత్కపల్లి/పెద్దపల్లి ఆగస్టు27 ప్రజావాణి : ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఓదెల ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేవైఎం పెద్దపల్లి జిల్లా నాయకులు పుల్లూరి పృథ్విరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థినులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సోదరులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగ నిలుస్తుందని...