ఘనంగా తిరుపతిరెడ్డి నగర్ 12 వ వార్షికోత్సవం. నిరుపేదలకు ఇంటి పట్టాలుఇవ్వ కపోతే రిలేదీక్షలు:సిపిఐహెచ్చరిక

పోరుమామిళ్ల(ఆగస్టు10 ప్రజావాణి) పట్టణంలోని రెడ్డి నగర్ 12వ వార్షికోత్సవవేడుకలు ఘనంగాజరిగాయి.ఈసందర్భంగా రంగసముద్రం పంచాయతీ పరిధిలోనిసర్వేనెంబర్1008/2A1 లో గత 11 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలకు రెవెన్యూఅధికారులుఇప్పటివరకు ఇంటి పట్టాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులువీరశేఖర్,ఏరియాకార్య దర్శి పిడుగు మస్తాన్ తీవ్రస్థాయి లో మండిపడ్డారు, దశాబ్దకాలంగా.నివాసముంటున్నపేదలకురెవెన్యూఅధికారులుఎందుకుపట్టాలుఇవ్వడంలేదనివారునిలదీశారు.ఈ కాలనీకి వెంటనే మౌలిక వసతులు కల్పించాలని,నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ప్రాంతంలోని పేదలు ఎండకు,వానకు,గాలికి,చలికి తట్టుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని,పిల్లలను బడికి పంపలేక చిన్నచిన్న దుకాణాల్లో,హోటళ్లలో పనులు చేసుకుంటూ...