prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 2:46 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్‌కేసర్ పోలీస్‌ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఘట్‌కేసర్, ఆగస్టు 15: ఘట్‌కేసర్ పోలీస్‌ స్టేషన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ బాలస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. అనంతరం పోలీసు సిబ్బంది, ప్రజలు జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు.

కార్యక్రమంలో ఎస్‌ఐలు ప్రభాకర్ రెడ్డి, శేఖర్, రాఘవేంద్ర, హీనా, పోలీసు సిబ్బంది, ఘట్‌కేసర్‌కు చెందిన పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు వేడుకలకు హాజరై పోలీసులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి నినాదాలతో సందడిగా సాగాయి.