ఘట్కేసర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ….దేశభక్తి నినాదాలతో మార్మోగిన వీధులు
ఘట్కేసర్, ఆగస్టు 12 (ప్రజా వాణి): ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్ 6వ డివిజన్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధిష్ఠానం, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఘట్కేసర్ బస్టాండ్ నుంచి శివారెడ్డిగూడ హనుమాన్ ఆలయం వరకు ర్యాలీ కొనసాగింది. జాతీయ జెండాలను చేతబూనిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో ఘట్కేసర్ ప్రధాన వీధులు మార్మోగాయి. ‘జై...