prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 7:10 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్కేసర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ….దేశభక్తి నినాదాలతో మార్మోగిన వీధులు

ఘట్కేసర్, ఆగస్టు 12 (ప్రజా వాణి): ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్ 6వ డివిజన్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధిష్ఠానం, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఘట్కేసర్ బస్టాండ్ నుంచి శివారెడ్డిగూడ హనుమాన్ ఆలయం వరకు ర్యాలీ కొనసాగింది.

జాతీయ జెండాలను చేతబూనిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో ఘట్కేసర్ ప్రధాన వీధులు మార్మోగాయి. ‘జై హింద్’, ‘భారత్ మాతా కీ జై’, ‘వందే మాతరం’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది.

ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ బీజేపీ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి, ఘట్కేసర్ ఇన్‌చార్జ్ జైపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వి. హనుమాన్, ‘హర్ ఘర్ తిరంగా’ జిల్లా కన్వీనర్ బోడ శ్రీనివాస్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు చెల్లక శ్రీధర్, మంగు రాధిక, కార్యదర్శి సిద్దిరాజు, సీనియర్ నాయకులు రామోజీ, పల్లె మధు, యువమోర్చా నాయకుడు అనిల్ గౌడ్, కో-కన్వీనర్ సురేందర్ యాదవ్, బూత్ అధ్యక్షులు మాధవి, మమత శర్మ, శరత్, కిరణ్ కుమార్, చంద్రకాంత్, చలపతి రావు, దీపక్ వ్యాస్, సీనియర్ నాయకులు హర గోపాల్, యువమోర్చా నాయకులు భరత్ యాదవ్, అశోక్, రుషి, అభి యాదవ్‌తో పాటు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు, యువత, బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.