ఘట్‌కేసర్‌లో అక్రమంగా తరలిస్తున్న 38 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం..ముగ్గురు అరెస్ట్.. మరో ముగ్గురి కోసం పోలీసుల గాలింపు
ఘట్‌కేసర్, ఆగస్టు 9: ఘట్‌కేసర్‌లో అక్రమంగా తరలిస్తున్న 38 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం ఘట్‌కేసర్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో అంబేద్కర్ విగ్రహం సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా తరలిస్తున్న వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా, అందులో సుమారు 38 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. దీంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏ1 నాగరాజు, ఏ2...