prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 10:58 pm Digital Edition : GIRIBABU KONDHURG

గ్రామాల్లో అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ప్రజా ప్రభుత్వానికి పేదరికమే ప్రత్యేక కొలమానం కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి

పేదవారి సొంతింటి స్వప్నం సాకాకరమైన వేళ…. పేదళ సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ఎజెండా

గ్రామాల్లో అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ప్రజా ప్రభుత్వానికి పేదరికమే ప్రత్యేక కొలమానం

కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి

కొందుర్గ్ మండలములోని అయోధ్యపుర్ తండా లో స్వప్న శ్రీను ఇందిరమ్మఇళ్ల ప్రారంభోత్సవం..

కొందుర్గ్ మండలంలోని అయోధ్యపుర్ తండా లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన వారి గృహ ప్రవేశ కార్యక్రమం చాలా ఆర్భాటంగా జరిగింది
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల గ్రామంలో నిర్మాణాలు పూర్తయిన లబ్ధిదారులైన జేర్పుల స్వప్న శ్రీను దంపతులు ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మహోత్సవం ఘనంగా నిర్వహించటం జరిగింది
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కొందుర్గ్ మండల అధ్యక్షులు కొగురి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. మరి అలాగే గ్రామాలలో నిరుపేదలైన ఇల్లు లేని ప్రతిఒక్కరికి రాజకీయ పార్టీలకు అతీతంగా ఇళ్లు మంజూరి చేస్తుంది మన ప్రజా ప్రభుత్వం అని ఆయన అన్నారు అనంతరం నూతన గృహంలో పూజా కార్యక్రమo నిర్వహించి, లబ్ధిదారులైన జెర్పుల స్వప్న శ్రీను దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సులోచన కృష్ణ రెడ్డి,సర్పంచ్ గోపాల్ నాయక్ ,మాజీ ఎంపీటీసీ మల్లేష్ గౌడ్,మాజీ వైస్ ఎంపీపీ మంగులాల్ ,ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రీను నాయక్,శ్రీరంగపూర్ సర్పంచు రమేష్,చిన్న ఎల్కిచర్ల సర్పంచ్ రాజుకుమార్ ,పీఏసీఎస్ డైరెక్టర్ నర్సింలు ,గణేష్,లింబ్య,నర్సింలు నాయక్,సత్య నాయక్ కళ్యాణ్ రెడ్డి దర్శన్ శ్రీను,ఆకాష్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.