prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 8:01 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

గోదావరి ఇసుక పేరుతో జరుగుతున్న కమర్షియల్ దందాలపై అధికారులు మౌనం వీడాలి*

గోదావరి ఇసుక పేరుతో జరుగుతున్న కమర్షియల్ దందాలపై అధికారులు మౌనం వీడాలి

*పత్రికలో పలుమార్లు వార్తలు రాసిన పట్టించుకోని మైనింగ్ అధికారులు*

*ఈ దందా వెనుక అధికారుల అండదండలు తెలంగాణ ఉండడమే దీనికి కారణమనే ఆరోపణలు*

తొర్రూరు పట్టణ కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గోదావరి ఇసుక పేరుతో అక్రమ కమర్షియల్ ఇసుక దందాను కొంతమంది వ్యక్తులు తన ఇష్టానుసారంగా, నిర్వహిస్తున్న మైనింగ్ రెవెన్యూ అధికారులు మాత్రం, చోద్యం చూస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక ట్రిప్పు 8 వేల రూపాయల పైచిలుకు, అమ్మకాలు జరుపుతున్న, పట్టించుకునే అధికారులే లేకపోవడం పట్టణ కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. కొత్త ఇండ్లు నిర్మించుకునే, వారు మాత్రం ఇసుక ధరలను చూసి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అదేవిధంగా స్థానిక మండలంలో మైనింగ్ రెవెన్యూ అధికారులు ఉన్నట్టా లేనట్టా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈ అక్రమ ఇసుక దందాలకు అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడం మూలంగానే అడ్డగోలుగా అక్రమ దందాలు చేసే అక్రమార్కులు, ధనార్జన ద్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ దందాలు చేసేవారు ప్రతినెల అధికారులకు ముడుపులు చెల్లించుతున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. పలుమార్లు పత్రికల్లో వార్తలు వచ్చిన, అధికారుల తీరు మాత్రం” చెవిటి వాడి ముందు శంఖం వుదిన చందంగా” ఉండడం విశేషం. స్థానిక అధికారుల అవినీతి తీరుమూలంగా ప్రభుత్వ ఖజానాకు ఇసుక అక్రమార్కులు గండికోడుతూ, లోకల్ ఇసుకను కూడా అందులో కలిపి గోదావరి ఇసుక అంటూ తన ఇష్టానుసారంగా, దోచుకోవడం తొర్రూరు పట్టణ కేంద్రంలో పరిపాటిగా మారింది. కావున జిల్లా కలెక్టర్ ఈ అంశంపై స్పందించి గోదావరి ఇసుక పేరుతో జరుగుతున్న కమర్షియల్ ఇసుక దందాలపై, కన్నేసి, స్థానిక అధికారుల తీరుపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకొని గోదావరి ఇసుక అక్రమ దందాలను అరికట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే?