గూడెంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన -సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్
బెజ్జంకి, ఆగస్టు 27 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత ఏర్పడుతుందని తెలిపారు. అనంతరం SIR (Special Intensive Revision) ఓటరు జాబితా విస్తృత సవరణలో భాగంగా ఇటీవల ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై గ్రామ సభ నిర్వహించారు....