prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 2:22 pm Digital Edition : RAJASHEKARREDDY

గూడెంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన -సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్

బెజ్జంకి, ఆగస్టు 27 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత ఏర్పడుతుందని తెలిపారు.
అనంతరం SIR (Special Intensive Revision) ఓటరు జాబితా విస్తృత సవరణలో భాగంగా ఇటీవల ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై గ్రామ సభ నిర్వహించారు. ప్రజలు తమ వివరాలను పరిశీలించుకొని, ఏవైనా అభ్యంతరాలు లేదా మార్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పర్శురాములు, కార్యదర్శి యాదగిరి, వార్డు సభ్యులు నూనె రాములు, బోనాల రమేశ్, జోసెఫ్ మేరీ, బీఎల్‌ఓ సరోజన, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.