గురువుకు ఘన వీడ్కోలు శిష్యుల ఆత్మీయ సత్కారం
*గురువుకు ఘన వీడ్కోలు శిష్యుల ఆత్మీయ సత్కారం* మేడ్చల్ ఆగస్టు 19:- ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో వృత్తివిద్య ఉపాధ్యాయుడిగా ఎన్నో సంవత్సరాల పాటు విద్యార్థులకు విద్యాబోధన చేసిన శ్రీ రామ్మోహన్ సార్ పదవీవిరమణ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది. విద్యార్థులకు పాఠాలు చెప్పిన గురువు పదవీ విరమణ చేస్తుండటంతో పూర్వ విద్యార్థులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. *గురువు సేవలకు గుర్తుగా సన్మానం* ఈ సందర్భంగా పూర్వ...