గురుకుల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తా… అధ్యాపకుల కొరతను పరిష్కరిస్తా.. కేజీ నుంచి పీజీ వరకు ఏర్పాటుకు కృషి… అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి..

ఘట్‌కేసర్, ఆగస్టు 22 (ప్రజావాణి): గురుకుల్ కళాశాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందించడంతో పాటు, కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని గురుకుల్ కళాశాలలో గురుకుల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థుల కోసం నిర్మించిన వాష్‌రూమ్‌లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గురుకుల్ కళాశాల అభివృద్ధి కోసం గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు చేస్తున్న...