గుగ్గిళ్ల యువకుడికి బెస్ట్ ఎంప్లాయ్ గా అవార్డు ⭐ విధుల్లో అంకితభావానికి గుర్తింపు.. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం
బెజ్జంకి, ఆగస్టు 15 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన రేవోజు అనిల్ కుమార్ బెస్ట్ ఎంప్లాయ్‌గా ప్రశంసా పత్రం అందుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో బెస్ట్ ఎంప్లాయ్‌గా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అనిల్ కుమార్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విధుల పట్ల అంకితభావంతో, సమర్థవంతంగా పనిచేసినందుకు ఈ గుర్తింపు లభించింది. బెస్ట్ ఎంప్లాయ్‌గా...