గుగ్గిళ్ల గ్రామసభలో పలు సమస్యలపై చర్చ -” కోళ్ల ఫారం అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తుల డిమాండ్”

  బెజ్జంకి,ఆగష్టు 15(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహారం, జల్‌ జీవన్‌ మిషన్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కార్యక్రమాల అమలుపై చర్చించారు. అలాగే గ్రామంలోని వివిధ సర్వే నంబర్లకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. *కోళ్ల ఫారం అనుమతులు రద్దు చేయాలని వినతి* సర్వే నెంబర్ 55/28, 55/48, 69/57, 69/2A, 67/58, 55/40,...