బెజ్జంకి, ఆగస్టు 25 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు గ్రామాన్ని పచ్చదనంతో నింపవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, ఉప సర్పంచ్ దుగ్యాని లావణ్య, వార్డు సభ్యులు కొంకటి సంపత్, గుగ్గిళ్ల లావణ్య, ర్యాకం అనిత, దూశెట్టి రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి వంశీధర్, ఫీల్డ్ అసిస్టెంట్ ర్యాకం రాజు, గుగ్గిళ్ల రాజేష్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.