*గుగ్గిళ్లలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు* -జాతీయ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య
బెజ్జంకి, ఆగస్టు 15 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను గుగ్గిళ్ల సర్పంచ్ మల్లయ్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మల్లయ్య మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొంది, దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన రోజే స్వాతంత్ర్య దినోత్సవమని అన్నారు.ఎందరో అమరవీరులు దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించారని తెలిపారు. వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.దేశ ఐక్యత,...