prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 10:39 am Digital Edition : RAJASHEKARREDDY

*గుగ్గిళ్లలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు* -జాతీయ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్‌ గుగ్గిళ్ల మల్లయ్య

బెజ్జంకి, ఆగస్టు 15 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  జాతీయ జెండాను  గుగ్గిళ్ల సర్పంచ్ మల్లయ్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్‌ మల్లయ్య మాట్లాడుతూ.. బ్రిటిష్‌ పాలకుల నుంచి విముక్తి పొంది, దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన రోజే స్వాతంత్ర్య దినోత్సవమని అన్నారు.ఎందరో అమరవీరులు దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించారని తెలిపారు. వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ దూగ్యని లావణ్య-మోహన్‌, ర్యాకం అనిత, పోతు భూలక్ష్మి, కొంకటి కుమార్‌, కొంకటి సురేష్‌, సీత రేణుక, కొంకటి సంపత్‌, దూశెట్టి రాజు, పంతంగి వెంకటేష్‌, లావణ్య, పంచాయతీ కార్యదర్శి వంశీ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాజు, కారోబార్‌ అశోక్‌, వీవోఏ లక్ష్మణ్‌, భాగ్య, అంగన్‌వాడీ టీచర్లు శోభ, భారతి, ఆశా కార్యకర్త రజిత, పంచాయతీ కార్మికులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.