prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 9:58 am Digital Edition : RAJASHEKARREDDY

గుగ్గిళ్లలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

బెజ్జంకి, ఆగస్టు 18 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ కుటుంబ సభ్యులు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరుడని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో గౌడ కుటుంబ సభ్యులు, సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.