గుగ్గిళ్లలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

బెజ్జంకి, ఆగస్టు 18 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ కుటుంబ సభ్యులు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరుడని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, సామాజిక...