prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 6:23 pm Digital Edition : RUPAVATHRAMESH HUZURNAGARR

గిరిజన తండాల్లో కరెంటు కష్టాలు.

గిరిజన తండాల్లో కరెంటు కష్టాలు.

మఠంపల్లి మండలంలోని గిరిజన తండాలకు విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తంగా మారింది…!

తరచూ ఏర్పడుతున్న విద్యుత్‌ అంతరాయాలతో గిరిజన ప్రజలు నిత్యం ఇబ్బందులు.

విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో ఎంతసేపు ఉంటుందో? తెలియని దుస్థితి.

ఎండుతున్న వరి పొలాలు.

కరెంట్ కష్టాలకు పరిష్కారం చూపేది ఎవరు?

సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్య పాండు నాయక్.

హుజూర్నగర్ ఆగస్టు 14 (ప్రజావాణి)

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని భీమ్లా తండా, భోజ్య తండ, రామచంద్రపురం తండా, సుల్తాన్ పురం తండాలకు ఎన్సీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి 33/11 కెవి సబ్ స్టేషన్ నుండి వస్తున్న విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తంగా మారిందని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్య పాండు నాయక్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ (ఏఈ) కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ ఏర్పడుతున్న విద్యుత్‌ అంతరాయాలతో గిరిజన ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో? ఎంతసేపు ఉంటుందో? తెలియని దుస్థితి నెలకొంది. గంటల తరబడి కరెంట్‌ పోతుండడంతో దోమలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న గిరిజన ప్రజలు చిన్న పిల్లలు వర్షాకాలం సీజన్లో దోమల బెడద తీవ్రంగా ఉండటం వలన రాత్రి రెండు గంటలు పడిగాపులు కాస్తున్నారని సబ్ స్టేషన్కు ఫోన్ చేస్తే ఏఈ కి చెప్పండి అని అంటున్నారు. అసలే వర్షాలు లేక రైతులు బోర్లు బావుల కింద అర ఎకరం 10 కుంటల చొప్పున తిండి కొరకు వరి నాటు వేసుకుంటే విద్యుత్ లేక ఎండిపోతున్నాయి. గత ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తే ప్రజల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొని రైతులకు కనీసం ఆరు గంటలు కూడా కరెంటు ఇచ్చే పరిస్థితి లేదని, కరెంట్‌ వస్తూ పోతుండడంతో ఇళ్లలో ఉన్న ఎలక్ర్టానిక్‌ గృహోపకరణాలు సైతం కాలిపోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి రైతులు భూక్య కేశ్య నాయక్, భూక్య శ్రీను నాయక్, భూక్య శంబయ్య నాయక్, పానుగోతు రాజు నాయక్, పానుగోతు లల్ సింగ్ నాయక్, బానోతు నంద నాయక్, భూక్య నాగు నాయక్, భూక్య లచ్చిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.