గాజులరామారం యూపీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ

గాజులరామారం యూపీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ విధుల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం.. వైద్య సేవలు మెరుగుపరచాలని ఆదేశం మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా డీఎంహెచ్‌ఓ డా. కె. ఆనంద్ గాజులరామారం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ (యూపీహెచ్‌సీ)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా విధుల్లో ఉండాల్సిన మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ (ఎల్‌టీ) ముందస్తు అనుమతి లేకుండా విధులకు హాజరుకాకపోవడాన్ని గుర్తించారు. దీనిపై సంబంధిత సిబ్బందిని వివరణ కోరుతూ, విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. యూపీహెచ్‌సీలోని మందుల నిల్వలను స్టాక్ రిజిస్టర్‌తో సరిపోల్చి పరిశీలించారు. మందుల...