prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 10:44 am Digital Edition : RAJASHEKARREDDY

గాగిల్లాపూర్‌లో ఘనంగా వన మహోత్సవం ” వనమహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటికి ఐదు చెట్ల పంపిణీ”

బెజ్జంకి,ఆగస్టు 20 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం–2026 కార్యక్రమంలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని ప్రతి ఇంటికి 5 మొక్కల చొప్పున గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి రాజు, ఉపసర్పంచ్ చింతలపల్లి పద్మ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని పచ్చదనంతో నింపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని,ప్రభుత్వం అందిస్తున్న మొక్కలను ఇంటి ముందు, పొలాల్లో నాటి, వాటిని సంరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాము రాజేంద్రప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్ బుర్ర రాములు, తదితరులు పాల్గొన్నారు.