గడి మైసమ్మ తల్లి బోనాలకు విస్తృత ప్రచారం

*గడి మైసమ్మ తల్లి బోనాలకు విస్తృత ప్రచారం* మేడ్చల్ ఆగస్టు 18 (పీపుల్స్ డైరీ) శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న గడి మైసమ్మ తల్లి బోనాల పండుగకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. బోనాల ఉత్సవం గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేసేందుకు ఆటోలకు బోనాల స్టిక్కర్లను అందించినట్లు పాలకుర్తి రాఘవేంద్ర గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడి మైసమ్మ తల్లి బోనాల పండుగకు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు...