prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 5:26 pm Digital Edition : MAHESH MEDCHAL

గడిమైసమ్మ బోనాల పండుగ ఏర్పాట్లపై డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణ

గడిమైసమ్మ బోనాల పండుగ ఏర్పాట్లపై డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణ

మేడ్చల్: మేడ్చల్ పట్టణంలో ఈ నెల 23వ తేదీన ఆదివారం నిర్వహించనున్న శ్రీ గడిమైసమ్మ తల్లి శ్రావణమాస బోనాల పండుగను పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీ సుధాంశ్ గురువారం దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న పండుగ ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.

దేవాలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులను సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో పనిచేయని లైట్లను మరమ్మతులు చేయించారు. బోనాల పండుగ సందర్భంగా పారిశుధ్యం, విద్యుత్‌ దీపాలు తదితర ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యవేక్షణ కార్యక్రమంతో పండుగకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.