prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 9:39 am Digital Edition : NAVEEN NADIKUDA

కౌకొండలో విషాదం.. జన్నారపు కట్టయ్య మృతి  

కుటుంబ పెద్దను కోల్పోయిన బాధాకర సమయంలో బాధిత కుటుంబానికి పలువురి పరామర్శ.. ధైర్యం

ప్రజావాణి నడి కూడా ఆగస్టు 14

నడికూడ: నడికూడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన జన్నారపు కట్టయ్య గురువారం అర్ధరాత్రి 12.10 గంటల సమయంలో మృతి చెందారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కట్టయ్యకు ఇద్దరు పిల్లలు ఉండటంతో వారి పరిస్థితిని చూసి గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

కుటుంబ పెద్దను కోల్పోయిన బాధాకర సమయంలో కౌకొండ గ్రామ సర్పంచ్ ఓదెల, శ్రీలత భాస్కర్ గ్రామ ఉపసర్పంచ్ ముక్కెర రాజు టీఆర్‌ఎస్ నడికూడ మండల అధికార ప్రతినిధి లింగాల తిరుపతి, పూరెల్ల భాస్కర్, మాజీ ఉపసర్పంచ్, టీఆర్‌ఎస్ నడికూడ మండల ఇన్‌చార్జి జలుగూరి రమేష్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మేకల నరేష్, పసుల కరుణాకార్,చుక్క రత్నాకర్, చుక్క ప్రశాంత్, మేకల అనిల్, రహిమాన్ తదితరులు కట్టయ్య కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, కష్టకాలంలో తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. కట్టయ్య మృతి గ్రామానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు.