కోటగిరిలో సర్దార్ పాపన్న 376వ జయంతి.
గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన గొప్ప వీరుడు పాపన్న గౌడ్.
ఏ.గంగా ప్రసాద్ గౌడ్.
ట్యాంక్ బండ్ పై కాంస్య విగ్రహవిష్కరణకు భారీగా తరలి వెళ్లిన గౌడ సంఘం నాయకులు.
కోటగిరి/ప్రజావాణి:-గోల్కొండలోని జమీందారులు, జాగీర్దారులు,పెత్తందారులను తరిమికొట్టి గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ అని గౌడ సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఏ.గంగా ప్రసాద్ గౌడ్ గుర్తు చేశారు.సోమవారం కోటగిరి మండల కేంద్రంలోని కల్లు సొసైటీ కార్యాలయంలో గీత పరిశ్రమ సహకార సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి సొసైటీ సభ్యులు,కోటగిరి,పోతంగల్ మండల గౌడ కులస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం స్వీట్స్ పంచిపెట్టారు.ఈ సందర్భంగా గౌడ సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఏ.గంగా ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.సర్దార్ పాపన్న గౌడ్ గౌడ కులస్తుల పుట్టినప్పటికీ సామాన్యుల కోసం,బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన తెలంగాణ వీరుడని కొనియాడారు.నేడు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పై గౌడ కులస్తుల ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరిస్తుందని తెలిపారు.ఇది గౌడ జాతికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తు న్నామని అన్నారు.ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనేం దుకు కోటగిరి,పోతంగల్ మండలాల గౌడ కులస్తులు హైదరాబాద్కు తరలి వెళ్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో కోటగిరి టిసిఎస్ అధ్యక్షులు డి.శంకర్ గౌడ్, సెక్రటరీ ఎస్.సాయిబాబా గౌడ్,మాజీ అధ్యక్షులు టి.భూమా గౌడ్,ఏ.విఠల్ గౌడ్,తెలంగాణ రాష్ట్ర గీత పని వాళ్ల సంఘం మండల అధ్యక్షులు బి.వెంక గౌడ్,శ్రీధర్ గౌడ్,రాజా గౌడ్, కల్లుగీత కార్మికులు సాయికృష్ణ గౌడ్,నరేష్ గౌడ్,యాదగిరి గౌడ్,తదితరులు పాల్గొన్నారు.