కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట మీద నిలబడాలి… ప్రమాణానికి రావాలి — మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

ప్రమాణానికి రాకపోతే మునుగోడు నియోజకవర్గం ప్రజలు నిన్ను నమ్మరు, నీ మాటలను నమ్మరు... నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి: ప్రభుత్వ వ్యతిరేకత మీద గత సోమవారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమంలో చండూరు చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ చండూరు మున్సిపాలిటీలో బస్సు షెల్టర్ మొదట పండ్ల బండ్ల దగ్గర కడతామని చెప్పి తర్వాత మరొకచోట కడుతున్నారని, ఆ పండ్ల బండ్ల షాపు వాళ్లను బెదిరియ్యగానే తల ఒకటి, రెండు చొప్పున మొత్తం 12 లక్షలు అంటుకున్నారని, వీళ్లు...