కుటుంబ కలహాలతో భార్యను ఇటుకతో కొట్టి హత్య…మద్యం మత్తులో ఘాతుకానికి పాల్పడిన భర్త.. ఘట్కేసర్‌లో దారుణం
ఘట్కేసర్, ఆగస్టు 12 (ప్రజా వాణి): కుటుంబ తగాదాలు, భార్యపై అనుమానంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో కట్టుకున్న భార్యపై సిమెంట్ ఇటుకతో దాడి చేసి హత్య చేసిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకానగర్‌లో, మినర్వా పాఠశాల సమీపంలో చోటుచేసుకుంది. ఘటనపై మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కిలగనపూర్ మండలం సలకలపూర్ గ్రామానికి చెందిన ఇస్లావత్ మాన్య...