కీర్తిశేషులు మీరంపల్లి రాములు జ్ఞాపకార్థం వాటర్ ట్యాంక్, 20 నల్లాల ఏర్పాటు
చందనవెల్లి, ఆగస్టు 17, ప్రజావాణి: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామంలో కీర్తిశేషులు మీరంపల్లి రాములు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వాటర్ ట్యాంక్‌తో పాటు 20 నల్లాలను ఏర్పాటు చేశారు.
మీరంపల్లి వెంకటేష్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సోమవారం గ్రామంలోని వైకుంఠధామంలో ఈ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అంత్యక్రియల అనంతరం కాళ్లు, చేతులు కడుక్కోవడంతో పాటు దిన, వార కార్యక్రమాల సమయంలో స్నానాలు చేసుకునేందుకు ఈ వాటర్ ట్యాంక్, నల్లాలు ఉపయోగపడనున్నాయి.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చేవెళ్ల నవనీత స్వామి, మాజీ సర్పంచ్ కొలన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ యాదయ్య, ఉప సర్పంచ్ శ్రీశైలం, గ్రామ పాలకవర్గ సభ్యులు శ్రీహరి, కమలమ్మ, సాయికిరణ్, అనసూయ, రాములు, శిరీష, రాఘవచారి, రమేష్, వెంకటేష్, కృష్ణయ్య, రామచందర్, రామస్వామి, రాజమల్లు, పుష్పమ్మ తదితరులు వెంకటేష్ కుటుంబ సభ్యులను అభినందించారు. గ్రామ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.