కిష్టారెడ్డిపేటలో అక్రమ అంతస్తుల కూల్చివేత

•కిష్టారెడ్డిపేటలో అక్రమ అంతస్తుల కూల్చివేత అమీన్పూర్, ఆగస్టు 25 (ప్రజావాణి): అమీన్పూర్ డివిజన్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో అక్రమంగా నిర్మించిన అదనపు అంతస్తుల టౌన్‌ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. కిష్టారెడ్డిపేట లోని సర్వే నంబర్ 259లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆరో అంతస్తును అమీన్పూర్ టౌన్‌ ప్లానింగ్ అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో కూల్చివేత పనులు ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు...