prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 8:25 pm Digital Edition : SRIKANTH MULUGU

కారు-బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

కారు-బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి):-

ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కాటాపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పస్రా బండి సాయి తీవ్రంగా గాయపడ్డారు.
హెచ్‌పి పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఉన్న భారీ మూల మలుపు వద్ద వేగంగా వస్తున్న కారు, ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న *పసర గ్రామానికి చెందిన సాయి* అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన సాయికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తొలుత తాడ్వాయి పిహెచ్‌సి కి, అక్కడి నుండి ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రమాదంపై తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*జాగ్రత్త సూచన:* మూల మలుపులు, కూడళ్ల వద్ద వాహనదారులు వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా నడపాలని పోలీసులు సూచించారు.