కాచవానీ సింగారం లో అధ్వానంగా మారిన రహదారులపై బీజేపీ ధర్నా….వారం రోజుల్లో పనులు చేపడతామని కమిషనర్ వాణి హామీ
ఘట్కేసర్, ఆగస్టు 26: పోచారం డివిజన్ పరిధిలోని కాచవాని సింగారం, ముత్వెల్లిగూడ ప్రాంతాల్లో అధ్వానంగా మారిన ప్రధాన రహదారులను వెంటనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బీజేపీ ఘట్కేసర్ మండల అధ్యక్షుడు బస్వరాజు గౌడ్, స్థానిక నాయకుడు చిప్పలపల్లి దినేష్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బస్వరాజు గౌడ్ మాట్లాడుతూ.. ప్రధాన రహదారులపై నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. రహదారులు గుంతలమయంగా మారడంతో...