పోరుమామిళ్ల(ఆగస్టు10 ప్రజావాణి) పంచాయతీ ఆఫీస్ నుండి పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ లోకి పెద్ద ఎత్తున జైలు భరో జయప్రదం చేయాలి అంటూ జీతాలు పెంచాలని దూసుకపోవడం జరిగింది,స్థానిక ఐసిడిఎస్ఆఫీస్ ఆవరణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ మధ్యాహ్నం భోజనం ,తోపుడు బండి ఉపాధి కార్మికులు భవన నిర్మాణం కార్మికులు అసంఘటిత కార్మికులు మస్యలు పరిష్కరించాలని కనీస వేతనం 31,000 వేల రూపాయలు కల్పించాలని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ అమలు కావాలని కొత్తగా అమలు చేసిన నవచేతన యాప్ రద్దు చేయాలని. రైతులను రక్షించండి కార్మికులను రక్షించండి భారత్ భారతదేశ సార్వత్రిక జైల్లోనైనా పెట్టండి… జీతాలైన పెంచండి ఇవ్వండి అంటూ .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి యన్ భైరవప్రసాద్, సిఐటియు మండల అధ్యక్షులు సోమయ్య మాట్లాడుతూ.రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఆప్కాస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉన్నారని దాంతో ప్రథమ స్థానంగా అంగన్వాడీలు మధ్యాహ్న భోజనం ఆశాలు, మున్సిపల్ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి స్టాఫ్ నర్సులు శానిటేషన్ వర్కర్లు విద్యుత్ వర్కర్లు సెకండ్ ఏఎన్ఎంలు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసిన ఏఎన్ఎంలు గుడ్డలు షాపులో పనిచేసినటువంటి కార్మికులు హోటల్ లో పనిచేసే కార్మికులు ఇలాంటి ఇంకా ఎంతోమంది వర్కర్లు ఉన్నారు వీళ్ళందరికీ ప్రభుత్వాలు కనీస వేతనం కల్పించడం లేదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పిన ఇవ్వలేదు ఇంతవరకు కనీస వేతనం 31000 కల్పించలేదుఅనీ వారన్నారు,ఈరోజు చూస్తే దేశంలో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి జీతాలు లక్షల్లో ఉన్నాయని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు ఆప్కాస్ కార్మికులు స్కీమ్ వర్కర్ల కార్మికులకు చాలా తక్కువ జీతాలు ఉన్నాయని వారు ఆవేదనపడ్డారు.ఈ రోజున పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు దినసరి రోజువారి వస్తువులు అధిక ధరలుగా ఆకాశాన్ని అంటాయి ఇలాంటి అప్పుడు ప్రభుత్వం కళ్ళు మూసుకొని డబ్బున్నోడికే డబ్బు వస్తుందని రూపంగా పరిపాలన చేయడం చాలా దుర్మార్గమన్నారు
కార్మిక చట్టాలనేటువంటి 44 చట్టాలను దుర్మార్గంగా ఈ బీజేపీ ప్రభుత్వము కాలరాశి నాలుగునల్ల చట్టాలను తీసుకొని వచ్చి కార్మికులను కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ స్కీం ఆప్కాస్ అన్ని రంగాల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాల అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఉక్కు పాదం పై మోపుతూ ఉందని వారన్నారు ఎనిమిది ఎనిమిది గంటల పని దినాలను 12 గంటల పరిధిలో చేయడం దుర్మార్గమని వారు అన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కార్మికుల పక్షాన కాంట్రాక్టుల ఉద్యోగుల ఆప్కాస్ స్కీం కార్మికులు మరియు అన్ని ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కాంటాక్ట్ పక్షాన పని చేయాలని వారు అన్నారు లేని పక్షం అయితే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని స్వీకారం చూస్తామన్నారు,ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు (సిఐటియుఅనుబంధం) ప్రధాన కార్యదర్శి మేరీ, జ్యోతి ఓబులాపురం విజయమ్మ, గౌసియా బేగం వారి ఇరువురు మాట్లాడుతూ.అంగన్వాడీ వర్కర్లు గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసి తమకు జీతాలు పెంచమని అడిగితే ఆ ప్రభుత్వం పెంచకపోగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉండి మేము అధికారంలోకి వస్తే మీకు జీతాలు పెంచుతామని సమ్మె టెంట్లు కాడికి వచ్చి మజ్జిగ అన్నదానాలు షరభత్తులు అన్నదానాలు చేసి జీతాలు పెంచుతామని వాగ్దానం చేసి ఈరోజు దుర్మార్గంగా మూగివాడి లాగా నోరు మెదపకుండా గుడ్డివాడి లాగా సైలెంట్ గా ఉండటము ఎంత వరకు సమంజసమో అని వారు అన్నారు ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని
రోజువారి కూలీలకు 700 రూపాయలు ఏడు వందల రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది కానీ అసంఘటిత కార్మికులకు ఆ కూలీ డబ్బులు కూడా ఇవ్వలేదని వారన్నారు ఇప్పటికే యాపులతో సతమత అవుతున్న నెలల జీతాలు పడక చాలా కష్టంగా ఉందన్నారు ఈ దుర్మార్గమైన ప్రభుత్వము మాతో ఓట్లు వేయించుకొని
మాకు జీతాలు పెంచకుండా ఉన్నారన్నారు ఈరోజు ఉప్పు పప్పు బియ్యం బ్యాల్లు, గ్యాస్ ధరలు చూస్తే అందనంత దూరంగా ఉన్నాయన్నారు సార్వత్రిక సామాజిక భద్రత పెన్షన్ ప్రతి ఒక్కరికీ 10000 పెంచాలని వారన్నారు రైతాంగాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకుని వారి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షమైతే పెద్ద ఎత్తున పార్లమెంటు స్తంభింపచేస్తామని దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు వ్యవసాయ కార్మికులు అసంఘటిత కార్మికులు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఆప్కా స్కీం వర్కర్లు పెద్ద ఎత్తున దేశ పార్లమెంటును కూడా స్పందించేసామని వారు హెచ్చరించారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు లీడర్లు రేణుకా దేవి,వాణి సుధా ఇసాక్,మేకల వీరయ్య,ఆలీబాషా,రత్నం రామకృష్ణ గురయ్య మేరీ బీబీ ఓబులమ్మ దుర్గయ్య రాజు వెంకటరమణ కాంట్రాక్టర్ కార్మికులు అసంఘటిత కార్మికులు పాల్గొన్నారు అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు