కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేయాలి

*కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేయాలి* *మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయం ముట్టడించిన బీఆర్‌ఎస్ నాయకులు* మేడ్చల్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించి, అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మేడ్చల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని బీఆర్‌ఎస్ నాయకులు ముట్టడించారు.బీఆర్‌ఎస్ నాయకులు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ అనుషారెడ్డికి వినతిపత్రం అందజేశారు....