కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కోసం బీఆర్‌ఎస్ మహా ధర్నా

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం కీసర తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు కీసర గ్రామ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు చినింగని బాల్‌రాజ్, ప్రధాన కార్యదర్శి రాగుల గణేష్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు...