కళాశాలకు వెళ్లి చదువుకోమన్న తండ్రి మందలింపుతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కళాశాలకు వెళ్లి చదువుకోమన్న తండ్రి మందలింపుతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నంహైతాబాద్, ఆగస్టు 17, ప్రజావాణి: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ తండాకు చెందిన కేతావత్ అనసూయ (19) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ప్రస్తుతం అనసూయ శంషాబాద్‌లో డిగ్రీ చదువుతోంది.అనసూయ తండ్రి కేతావత్ కిషన్ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తె ప్రతిరోజూ కళాశాలకు వెళ్లి చదువుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి కిషన్ వినియోగించే టెల్మా-40 షుగర్ మాత్రలను...