కలెక్టర్ కుర్చీలో కలెక్టర్ పక్కనే సీఎం ములుగులో ఆసక్తికర దృశ్యం
కలెక్టర్ కుర్చీలో కలెక్టర్.. పక్కనే సీఎం.. ములుగులో ఆసక్తికర దృశ్యం ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ములుగు నూతన కలెక్టరేట్ ఐడీఓసీ భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ప్రత్యేకతను చాటుకున్నారు. నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్వయంగా కలెక్టర్‌ను కలెక్టర్ చైర్‌లో కూర్చోబెట్టి, పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. అధికార పదవికి గౌరవం ఇస్తూ.. ప్రజా సేవలో మరింత అంకితభావంతో పనిచేయాలని ప్రోత్సహించిన సీఎం తీరు అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి స్వయంగా కలెక్టర్‌ను కుర్చీలో ఆసీనులను చేసి అభినందించడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.