కరీంనగర్ డైరీ పాడి రైతుల పెండింగ్ ప్రోత్సాహకం విడుదల చేయాలి -లీటరుకు రూ.4 ప్రోత్సాహకం వెంటనే చెల్లించాలని డిమాండ్
బెజ్జంకి, ఆగస్టు 17 (ప్రజావాణి) కరీంనగర్ డైరీ చైర్మన్, యాజమాన్యం ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన కరీంనగర్ డైరీ పాల ఉత్పత్తిదారులు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం కరీంనగర్ డైరీ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుతంగా ర్యాలీలో పాల్గొన్నారు.ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాడి రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన లీటరుకు రూ.4 పెండింగ్ ప్రోత్సాహకాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి రైతుకు 50...