కడప జిల్లా లో కొన్ని సచివాలయాల్లో ఏఎన్ఎంల కొరత. స్పందించని అధికారులు

*ఒకేచోట ఇద్దరు.. మరికొచోట అసలే కరవైన ఏఎన్ఎంలు! *ఖాళీలు ఉన్నా వర్క్ ఆర్డర్స్‌తో సర్దుబాటు చేయడంలో జిల్లా అధికారుల తాత్సారం! *తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజలు,గర్భిణులు,బాలింతలు! *పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ.పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం! కడప జిల్లా ఆగస్టు 18 ప్రజావాణి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థలో సిబ్బంది కొరత మరియు అధికారుల అసమర్థ నిర్వహణ వెరసి ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించడంలో అత్యంత కీలకమైన 'గ్రేడ్-3 డిజిటల్ హెల్త్ అసిస్టెంట్' పోస్టుల భర్తీ,...