ఘట్‌కేసర్, ఆగస్టు 25 (ప్రజావాణి): నారపల్లిలో నిర్వహించనున్న కట్టపోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ మేరకు కట్ట మైసమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు అబ్బవతిని నర్సింహా, మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
బుధవారం నారపల్లిలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠాపన కార్యక్రమంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను ఆయనకు వివరించారు.
ఆహ్వానంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సానుకూలంగా స్పందించి ఆహ్వానాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నర్సింహారెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.