prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 6:34 pm Digital Edition : MAHESH MEDCHAL

కండ్లకోయలో ఘనంగా బోనాల పండుగ

కండ్లకోయలో ఘనంగా బోనాల పండుగ

కండ్లకోయలో ఆదివారం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతలకు బోనాల ఉత్సవం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా పోచమ్మ, రేణుక ఎల్లమ్మ, మైసమ్మ దేవతలకు ప్రత్యేక బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేత, గౌడవెల్లి మాజీ సర్పంచ్‌ జగన్‌రెడ్డి, కండ్లకోయ మాజీ సర్పంచ్‌ స్వామి తదితరులు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలకు ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించడం తెలంగాణ ప్రత్యేకత అని పేర్కొన్నారు. దైవ కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, సహకార భావాన్ని పెంపొందించడంతో పాటు ఆధ్యాత్మిక ఆత్మసంతృప్తిని కలిగిస్తాయని అన్నారు.:::